నటుడు విజయ్ వర్మతో స్టార్ హీరోయిన్ తమన్నా రెండేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ తో తమన్నా పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు వీరికి బ్రేకప్ అయిందనే వార్త ఆసక్తికరంగా మారింది. (Tamannaah Bhatia)
‘లస్ట్ స్టోరీస్ 2’ సమయంలో తమన్నా, విజయ్ వర్మ మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లు ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. వారి ప్రేమని, పెళ్లిపీటలు కూడా ఎక్కించాలి అనుకున్నారు. అందుకు తగ్గట్టే సోషల్ మీడియా, మీడియా వేదికగా కొన్ని హింట్లు కూడా ఇచ్చారు. మరి సడెన్ గా ఏమైందో ఏమో.. ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ చెప్పుకొని కూడా కొన్ని వారాలు అవుతున్నట్లు సమాచారం. న్యూస్ మాత్రం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆ న్యూస్ కి బలం చేకూరుస్తూ.. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను తాజాగా ఇద్దరూ డిలీట్ చేశారు.