2014 లో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్(Kiccha Sudeep)దర్శకత్వంలో కన్నడంలో తెరకెక్కిన మూవీ ‘మాణిక్య.ఈ సినిమాతో సినీ అరంగ్రేటమ్ చేసిన కన్నడ భామ ‘రన్యారావు'(Ranya Rao)ఆ తర్వాత తమిళంలో సీనియర్ హీరో ‘ప్రభు’ కొడుకు ‘విక్రమ్ ప్రభు’ సరసన తమిళంలో’వాగ్’ అనే సినిమాతో పాటు ‘పటాకీ’ అనే మరో కన్నడ మూవీ కూడా చేసింది.

రీసెంట్ గా ‘రన్యా’ దొంగచాటుగా పెద్ద మొత్తంలో బంగారం తీసుకొని బెంగళూరు(Bangalore)కు వచ్చింది.ఢిల్లీ(Delhi)డీఆర్‌ఐ(DRI)బృందానికి రన్యా స్మగ్లింగ్ గురించి ముందుగానే సమాచారం అందటంతో  బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో డీఆర్‌ఐ అధికారులు నటిని అదుపులోకి తీసుకున్నారు.దీంతో బంగారం అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా, మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు ఆదేశాలిచ్చింది.దీంతో పోలీసులు ‘రన్యా’ ని జైలుకి తరలించారు.’రన్యా’  తండ్రి సీనియర్ పోలీస్(Police)అధికారి కావడం విశేషం.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here