ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun)తన గత చిత్రం ‘పుష్ప 2′(Pushpa 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే.ఆ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాలుగా రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు.అందులో ఒకటి త్రివిక్రమ్(Trivikram)తో కాగా,రెండోది తమిళ దర్శకుడు అట్లీ(Atlee)తో. త్రివిక్రమ్ తో చెయ్యబోయే మూవీ కొన్ని రోజుల క్రితం అధికారకంగా ప్రారంభమైంది.ఇప్పుడు ‘అట్లీ’ మూవీ కూడా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ మూవీలో ‘అల్లు అర్జున్’ సరసన ఐదుగురు హీరోయిన్లు జోడి కట్టబోతున్నారని, జాన్వీకపూర్ వాళ్ళల్లో ఒకటనే వార్తలు వినిపిస్తున్నాయి.మిగతా నలుగురిలో విదేశీ నటీమణులు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.చిత్ర బృందం ఈ మూవీకి  సంబంధించిన అన్ని పనుల్ని మొదలుపెట్టిందని కూడా అంటున్నారు.అట్లీ 2023 లో షారుఖ్ తో చేసిన ‘జవాన్’ తో భారీ హిట్ ని అందుకున్నాడు.జవాన్ తర్వాత’అట్లీ’ ఎలాంటి మూవీ  చెయ్యలేదు.అల్లుఅర్జున్ కి ఒక పవర్ ఫుల్ సబ్జట్ చెప్పడం,అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.దీంతో ‘అట్లీ’ అల్లు అర్జున్’ కోసం వెయిట్ చేస్తు వస్తున్నాడు.

కానీ ‘త్రివిక్రమ్’ మూవీ లైన్ లోకి రావడంతో అందరు అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ నే ముందుగా వస్తుందనుకున్నారు.కానీ ఇప్పుడు ‘అట్లీ’ మూవీనే మొదట ఉంటుందనే టాక్ చాలా భాగంగా  వినపడుతుంది.అల్లు అర్జున్ ఇటీవల విదేశాలకి వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ‘అట్లీ’ మూవీలోని క్యారక్టర్ కి సంబంధించిన శిక్షణని తీసుకోవడానికే విదేశాలకి వెళ్ళొచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్.మరి ‘అల్లు అర్జున్’ ఫస్ట్ అట్లీతో చేస్తాడా లేక  ‘త్రివిక్రమ్’ తోనా అనే ఆసక్తి  అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది.రెండు చిత్రాలు  కూడా పాన్ ఇండియా స్థాయిలో విభిన్నమైన కధాంశాలతో తెరకెక్కబోతున్నాయి.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here