దీని రుచి ఎలా ఉంటుంది?
ఈ హనుమాన్ పండు స్ట్రాబెర్రీ, అరటిపండు కలిపి తింటే ఎలా ఉంటుందో అలాంటి రుచిని అందిస్తుంది. ఈ ముళ్ళ పండు లోపల గుజ్జు క్రీమీ గా ఉంటుంది. దీనిలో ఒక పండులో 148 క్యాలరీలు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అలాగే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. అన్నట్టు దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు కచ్చితంగా తినాల్సిన వాటిలో ఇది ఒకటి. ఈ పండును తినడం వల్ల పొట్ట సమస్యలు రావు. పరాన్న జీవి వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు, జ్వరం వంటివి కూడా చాలా వరకు తగ్గిపోతాయి.