సుదీర్ఘ కాలం నుంచి తెలుగు ప్రేక్షకులని తన గాత్రంతో అలరిస్తు వస్తున్న సింగర్ ‘కల్పన'(Kalpana).నిన్న ఉదయం హైదరాబాద్(Hyderabad)లోని తన ఫ్లాట్ లోనిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది.ఇప్పుడు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది.ప్రస్తుతం ఆమెకి వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ కొనసాగుతుండగా ప్రాణాపాయం లేదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టగా,పలు సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి.కల్పన 2010 లో తన భర్త నుంచి విడాకులు తీసుకొని 2018 లో కేరళ వ్యాపారి ప్రసాద్ ని రెండో వివాహం చేసుకుంది.మొదటి భర్తకి,తనకి 19 ఏళ్ళ కూతురు ఉంది. ఆమెకి,కల్పనకి తరచు గొడవలు అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రెండో భర్త ప్రసాద్ కూడా పోలీసుల దర్యాప్తులో తరచు తల్లి, కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ‘కల్పన ‘కేరళ(Kerala)నుంచి వచ్చిన మరుసటి రోజే ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టడంతో కేరళ లో ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చెయ్యనున్నారు.అందులో భాగంగా కూతురుతో కల్పన మాట్లాడిన కాల్ డేటాని కూడా సేకరించనున్నారు. కల్పన కూతురు కేరళలోనే ఉంటు చదువుకున్నటుగా తెలుస్తుంది.కల్పన రెగ్యులర్ గా నిద్రమాత్రలు తీసుకుంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.