ప్రముఖ స్టార్ సింగర్ ‘కల్పన'(Kalpana)ఆత్మహత్య యత్నానికి ఒడిగడుతు,నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ లోని తన ఇంటిలో నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో చెన్నై లో ఉన్న కల్పన భర్త ప్రసాద్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమె ఉంటున్న ఇంటి డోర్ పగలకొట్టి హాస్పిటల్ లో చేసారు.ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, స్పృహ లోకి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. డాక్టర్స్ మాత్రం ఇంకా అధికారకంగా కల్పన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడి చెయ్యలేదు.
ఈ కేసులో పోలీసులు విచారణ ప్రారంభించగా పలు విషయాలు బయటకి వస్తున్నాయి.కల్పన,ప్రసాద్ కేరళ(Kerla)లో సెటిల్ అయ్యారు.హైదరాబాద్(Hyderabad)లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నిజాంపేటలోని ప్లాట్ లో ఉంటుండగా,ఈ కోవలోనే రెండు రోజుల క్రితం కేరళ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది.ఆ మరుసటి రోజే ఆత్మహత్యకి పాల్పడటంతో కేరళలో ఏమైనా జరిగిందా అనే కోణంలో తో పాటు ప్రసాద్ చెన్నై ఎందుకు వెళ్లాడని విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కల్పన ఫోన్ ని స్వాధీనం చేసుకోగా వాట్స్ అప్ చాట్ లో కీలక సమాచారం లభ్యమయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కల్పన పూర్తిగా కోలుకోగానే పోలీసులు ఆమె నుంచి స్టేట్ మెంట్ కూడా రికార్డు చేయనున్నారు.ప్రస్తుతం ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్నారు
తమిళనాడు కి చెందిన కల్పన పూర్తి పేరు కల్పన రాఘవేంద్ర.చిన్నప్పట్నుంచి కర్ణాటక(Karnataka)సంగీతంలో ప్రావీణ్యురాలైన కల్పన ఎన్నో హిట్ సాంగ్ ని ఆలపించింది.తమిళంలో కూడా ఎన్నో హిట్ పాటలు పాడి ఎన్నో పురస్కారాలని కూడా అందుకుంది. కల్పన తల్లి తండ్రుల పేర్లు రాఘవేంద్ర, సులోచన.ఈ ఇద్దరు కూడా సింగర్స్ గా రాణించిన వాళ్లే.