ఇప్పుడదే జరగడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, అక్కడి మాజీలు, ఫ్యాన్స్ అందరూ ఉసూరుమన్నారు. ఇది అన్యాయం అంటూ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అంటున్నాడు. ఇది ఇక్కడితోనే ఆగిపోదని, ఇండియాలో జరిగే ఐసీసీ టోర్నీ కోసం పాకిస్థాన్ కూడా వెళ్లదని, ఇదిలాగే కొనసాగితే క్రికెట్ ప్రపంచానికి తీరని నష్టం జరుగుతుందని అతడు అంటున్నాడు.