హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 17 ఉద్యోగాలు ఉన్నాయి. వీటిని ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్, సీనియర్ ఆర్టీసన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు ఇవాళ్టి(మార్చి 05, 2025)తో పూర్తి కానుంది. అర్హులైన వారు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.