Indian stock market: దాదాపు గత 10 సెషన్ల తరువాత భారతీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాట పట్టింది. దాంతో, మార్కెట్ పతన దశ పూర్తయిందని, ఇక రీ బౌండ్ సమయం ప్రారంభమైందని ట్రేడర్లు, ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. చారిత్రకంగా కూడా మార్చి నెలలో మార్కెట్ తిరిగి పుంజుకున్న ఉదాహరణలు ఉన్నాయి.