కోళ్లు ఇంట్లోకి వస్తున్నాయని ఓ వ్యక్తి… వృద్ధుడి కాళ్లపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.