నటి రష్మిక మందన్నపై కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గనిగ రవి ఫైర్ అయ్యారు. కన్నడ అంటే ఆమెకు కనీసం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనడానికి ఆమె అంగీకరించలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలని, కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.