‘అక్కినేని నాగార్జున'(Nagarjuna)రెండో నట వారసుడు,నవ యువసామ్రాట్ ”అఖిల్ అక్కినేని'(Akhil Akkineni)హీరోగా 2023 ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఏజెంట్.’చిరంజీవి'(Chiranjeevi)తో సైరా నరసింహ రెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి(Surender reddy)దర్శకత్వంలో ఏజెంట్ తెరకెక్కడం,మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి(Mammootty)కీలక పాత్ర పోషించడంతో,’ఏజెంట్’ పై అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచింది. 

ఇక ఈ మూవీ రకరకాల కారణాల వల్ల ఓటిటి రిలీజ్ డేట్ ఆలస్యం  అవుతు వచ్చింది.దీంతో ఏజెంట్ ని ఓటిటి లో చూడాలని కోరుకున్న వాళ్ళు ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు.కానీ ఇప్పుడు వాళ్లందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ‘సోనీలైవ్'(SOny Live)లో మార్చి 14 నుంచి ఏజెంట్ స్ట్రీమింగ్  కానుంది.స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఏజెంట్ లో అఖిల్ నటన గాని,డాన్స్ గాని ఎంతో పవర్ ఫుల్ గా ఉంటాయి.తన లుక్స్ విషయంలో కూడా మిగతా సినిమాలకి భిన్నంగా కనపడటానికి చాలా కసరత్తులు చేసాడు.’సిక్స్ ప్యాక్’ బాడీలో  కనపడి అభిమానులకి,ప్రేక్షకులకి సరికొత్త జోష్ ని ఇచ్చాడు.

 అఖిల్ సరసన బాలీవుడ్ నటి ‘సాక్షి వైద్య'(sakshi Vaidya)జత కట్టగా ‘చిరంజీవి’తో వాల్తేరు వీరయ్య,’బాలకృష్ణ'(Balakrishna)తో  డాకు మహారాజ్ లో చేసిన ఊర్వశి రౌతేలా(Urvasi Rowthela) ఒక ప్రత్యేక గీతంలో చేసింది.డినో మోరియా, విక్రమ్ జిత్ ప్రధాన పాత్రలు పోషించగా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్,  రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఏజెంట్ ని నిర్మించారు.

 

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here