అక్కినేని నాగార్జున(Nagarjuna), పూరి జగన్నాథ్(Puri Jagannadh) కాంబోలో తెరకెక్కిన ‘సూపర్'(Super) మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ అయేషా టకియా (Ayesha Takia). హిందీలో సుమారు 20 చిత్రాల దాకా నటించిన అయేషా 2009 లో ఫర్హాన్ అజ్మీ(Farhan Azmi)ని వివాహం చేసుకోగా ఆ ఇద్దరికి ఒక కొడుకు ఉన్నాడు.
రీసెంట్ గా అయేషా భర్త ఫర్హాన్, కొడుకు గోవా వెళ్లారు. కండోలిం మార్కెట్ వద్ద స్థానికులకి, ఫర్హాన్ మధ్య గొడవ జరగడంతో పోలీసులు వచ్చి ఫర్హాన్ తో పాటు కొంత మందిని అరెస్ట్ చేసారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫర్హాన్ పై కొంత మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై అయేషా మాట్లాడుతూ, గోవా సంఘటన మాకొక పీడకల. అక్కడ ఏం జరిగిందనే నిజం తెలుసుకోకుండా నా భర్త పై తప్పుడు ప్రచారాలు సృష్టించవద్దు. ఆ గొడవలో నిజమైన బాధితులు నా భర్త, నా కొడుకే. గొడవ గురించి ఫర్హానే ఫిర్యాదు చేసినా కూడా అరెస్ట్ చెయ్యడం చాలా బాధాకరం. నా హస్బెండ్ ని, కొడుకుని తీసుకెళ్తున్నప్పుడు స్థానికులతో పాటు కొంత మంది మహిళలు నా కుమారుడిని తీవ్రమైన పదజాలంతో చాలా దారుణంగా తిట్టారు. ఆ మహిళల ప్రవర్తన సిగ్గు చేటు. ఈ గొడవలో ఎవరిది తప్పో, ఎవరు నిజమైన గూండాలో మీరే నిర్ధారించుకోండి” అంటూ ఇన్ స్టాగ్రమ్ వేదికగా గొడవకి సంబంధించిన పలు వీడియోల్ని అయేషా విడుదల చేసింది.