ధనుస్సు: కుజుని సంచారం వల్ల, ఈ రాశివారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు మంచి జీతం పెంపుతో పాటు, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అదే సమయంలో, ఇంకా ఉద్యోగం లేని వారికి మంచి జీతంతో, ఆశించిన స్థానంలో ఉద్యోగం లభిస్తుంది. స్వయంగా వ్యాపారం చేసేవారికి కుజుని సంచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.