మీన రాశి
మీన రాశి వారు ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన అమ్మకాలు, కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. పక్షులకి నీళ్లు పెట్టండి. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి.