నేలపై పడుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఖరీదైన పరుపులను వాడేవారు ఎక్కువైపోయారు. బెడ్ రూమ్‌లో అందమైన మంచాలు, వాటిపై వేలు ఖరీదు చేసే పరుపులు వేసుకొని పడుకుంటున్నారు. వాటితోనే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని భావిస్తారు. నిజానికి నేలపై పడుకోవడం వల్లే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నేలపై పడుకోవడం వల్ల నడుము, వెన్నెముక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాటికి రక్తప్రసరణ కూడా సరిగా జరుగుతుంది.