సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు చంద్రబాబుతో వైరం ఉందని అంటుంటారు. అది నిజమే. కానీ ఇప్పుడు కాదు. ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు. కాలానికి అనుగుణంగా మారాలి. ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలి’ అంటూ చెప్పుకొచ్చారు. వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.