చంద్రబాబు అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన “ప్రపంచ చరిత్ర” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అనేక ఆర్ధిక కష్టాల్లో ఉందన్న వెంకయ్య… ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కేంద్ర సహాయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే మాతృభాషకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.