జగిత్యాల జిల్లాలో ఏసీబీకి కోరుట్ల ఎస్ఐ శంకరయ్య చిక్కారు. ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ACB అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల మండలం జోగినిపల్లి శివారులో గత నెలలో మామిడితోటలో పేకాట ఆడిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 23 వేలు నగదు, మెుబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 8 మందిలో ఏడుగురి సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేసి బండారు శ్రీనివాస్ సెల్ ఫోన్ మాత్రం ఇవ్వలేదు. అందుకు గాను 5 వేలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు బండారు శ్రీనివాస్. ఈ క్రమంలోనే పక్కాగా స్కెచ్ వేసి పట్టుకున్నారు అధికారులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here