మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెద్దవంగర పోలీస్ స్టేషన్ లోనే మందు పార్టీని నిర్వహించారు. ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటికి రావటంతో… విషయం జిల్లా ఎస్పీ వరకు చేరింది. వీరి వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.