కార్తీక్ తండ్రితో సుహానా కుటుంబానికి గతంలో కొన్ని గొడవలు ఉంటాయి. మరి ఈ గొడవలు ఎక్కడి వరకూ వెళ్తాయి? వీటిని అధిగమించి కార్తీక్, సుహానా కలుస్తారా? అన్నది తెలుసుకోవాలంటే ఈ ధూమ్ ధామ్ మూవీ చూడాలి. ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అంతంతమాత్రమే ఆడినా.. ప్రైమ్ వీడియోలో మాత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. మరి ఈటీవీ విన్ ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.