ధరల కమిటీ సిఫారసులు..
ఇటీవల ధరల నిర్ణయ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ.. 3 ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ధరల పెంపు, కొత్త కంపెనీలకు అనుమతి, సాధారణ బార్లతో పాటు ఎలైట్ బార్లు, వైన్స్‌ల సంఖ్య పెంచాలని ప్రతిపాదించింది. తెలంగాణలో ఇప్పుడు 2వేల 620 మద్యం దుకాణాలు, వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు ఉన్నాయి. 12వేల 769 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో గ్రామంలో అనధికారికంగా 5 వరకు బెల్ట్ షాపులున్నాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా బెల్ట్ షాపులుంటాయనే ప్రచారం జరుగుతోంది.