TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. కమలనాథుల్లో నూతనోత్సాహం నెలకొంది. బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయాన్ని అందించిన ఓటర్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ వందనాలు తెలిపారు.