పిల్లలు సాండ్విచ్ అడుగుతున్నప్పుడు ఇలా కీమా సాండ్విచ్ పెట్టి చూడండి. వారికి మటన్ లోని పోషకాలు కూడా అందుతాయి. అలాగే బ్రౌన్ బ్రెడ్, ఉల్లిపాయ, టమోటోలో ఉన్న పోషకాలు కూడా శరీరంలో చేరుతాయి. దీన్ని చేయడం చాలా సులువు. కీమాను తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా కీమా సాండ్విచ్ చేసి పెడితే కీమా తినడం అలవాటవుతుంది. బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది, కాబట్టి ఇది పూర్తిగా హెల్దీ రెసిపీ అని చెప్పుకోవాలి.