వైద్యుల సూచనలు
జ్వరం,జలుబు,దగ్గు,గొంతు నొప్పి,శరీరా నొప్పులు, కండ్లకలక, తుమ్ములు, ముక్కు దిబ్బడ, చాతీ నొప్పి, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు లేదా వ్యాధులు మూడు రోజులు కంటే ఎక్కువగా ఉన్నాయంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వ్యక్తులతో ఆహారం, నీరు, బట్టలు పంచుకోకపోవడం మంచిది. తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైతే హ్యాండ్ సానిటిజర్ వాడాలి. తుమ్మేటప్పుడు లేదా దగ్గేటప్పుడు మోచేతి అడ్డు పెట్టుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్న వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. మార్కెట్ లో ఫ్లూ శాట్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ఏడాదికి ఒకసారైనా ఆ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.