కల్యాణ్ హోస్ట్ చేస్తాడు. అమ్మమ్మ తాతయ్య జడ్జ్‌లుగా ఉండి బెస్ట్ కపుల్ ఎవరో చెబుతారని కావ్య అంటుంది. మూకాభినయం అంటే ఒక పదాన్ని గానీ, సినిమా పేరు గానీ సైగలతో చేసి చూపిస్తే వేరేవాళ్లు అదేంటో చెప్పాలి అని కల్యాణ్ అంటాడు. తర్వాత భార్యాభర్తల బంధం, ప్రేమ గురించి గొప్పగా చెబుతారు ఇందిరాదేవి, సీతారామయ్య. అంటే తల్లి ప్రేమ కంటే భార్య ప్రేమ గొప్పదా అని రాజ్ అడుగుతాడు. అలా చూస్తే తల్లి ప్రేమే గొప్పది కానీ, పెళ్లి తర్వాత ఎక్కువ సంవత్సరాలు కాపురం చేయాల్సింది భార్యతోనే కదా అని ఇందిరాదేవి అంటుంది.
Home Entertainment Brahmamudi July 11th Episode: బ్రహ్మముడి- భర్త గిఫ్ట్‌గా ఇచ్చిన చీరను పనిమనిషికి ఇచ్చేసిన అపర్ణ-...