టీడీపీ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో సీసీ కెమేరాలు, వీడియోలు ద్వారా నిందితుల్ని గుర్తించారు. మొత్తం 71మంది దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. వీరిలో మూల్పూరి ప్రభుకాంత్ అలియాస్ ప్రేమ్‌కుమార్, ఎర్రగళ్ల నగేశ్, షేక్ కరీముల్లా, కొల్లి సుబ్రమణ్యం, బుగ్గల రాజేశ్, రామినేని రవిబాబు, మల్లవల్లి సాయి రాహుల్, షేక్ రబ్బాని, పాగోలు సురేశ్, బండారుపల్లి కోటేశ్వరరావు, పడమట నాగరాజు, దాసరి విజయ్, సాలియోహాన్, డొక్కు సాంబశివ వెంకన్నబాబు, మేచినేని విజయ్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తాజాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
Home Andhra Pradesh టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్, పోలీసుల ముమ్మర గాలింపు-vallabhaneni...