‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన నాగ్ అశ్విన్ (Nag Ashwin).. రెండో సినిమా ‘మహానటి’తో తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన తన మూడో చిత్రం ‘కల్కి 2898 AD’తో సంచలనాలు సృష్టించాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.1100 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాకి పార్ట్-2 కూడా ఉంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో నాగ్ అశ్విన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘కల్కి 2’నే అని భావించారంతా. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

ఇండియాలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏవీఎం ప్రొడక్షన్స్ తో నాగ్ అశ్విన్ చేతులు కలిపాడు. వీరి కలయికలో రానున్న కొత్త ప్రాజెక్ట్ కోసం అసోషియేట్ డైరెక్టర్స్ కావాలంటూ తాజాగా ఒక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘కల్కి 2’ని పక్కన పెట్టి, నాగ్ అశ్విన్ మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడా అని చర్చించుకుంటున్నారు.

ప్రభాస్ (Prabhas) సినిమాల సెకండ్ పార్ట్ ల విషయంలో ఈమధ్య ఇలాగే జరుగుతుంది. ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆ మూవీ పార్ట్-2 చేయకుండా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాతో బిజీ అయిపోయాడు. మరోవైపు, ‘సలార్’ తర్వాత ప్రభాస్ నుంచి ‘కల్కి’ వచ్చింది. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీతో ‘రాజా సాబ్’ చేస్తున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చేయనున్నాడు. ఇలా ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీ కావడంతో.. ఈ గ్యాప్ లో మరో ప్రాజెక్ట్ చేయాలని నాగ్ అశ్విన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే ఏవీఎం ప్రొడక్షన్స్ తో చేతులు కలిపాడని అంటున్నారు. అయితే ఇది వెబ్ సిరీస్ అని ప్రచారం జరుగుతోంది. ఈ సిరీస్ పూర్తయ్యాక నాగ్ అశ్విన్ మళ్ళీ తన ఫోకస్ ని ‘కల్కి 2’పై పెట్టనున్నాడని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here