చాలా చెరువులు మాయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 400కు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయని ఏవీ రంగనాథ్ తెలిపారు. ఎన్ఆర్ఎస్సీ నివేదిక ప్రకారం గడిచిన 44 ఏళ్లలో నగరంలో చాలా చెరువులు కనుమరుగయ్యాయన్నారు. చాలా చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. అలాంటి అక్రమ కట్టడాలు గుర్తించి వాటిని తొలగిస్తు్న్నామన్నారు. బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. త్వరలో హైడ్రాకు ప్రభుత్వం పెద్దఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందన్నారు. హైడ్రా పరిధిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 2,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి అని తెలిపారు. అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ ఆక్రమణలకు గురైయ్యాయని తెలిపారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు కూడా పూడుకుపోయాయన్నారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ప్రజలు స్థలాలు కొనుగోలు చేయొద్దని కోరారు.