కొన్ని మలయాళ సినిమాలకి తెలుగులో బాగా ఆదరణ లభించింది. అందులోను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మలయాళం నుండి మొహన్ లాల్, మమ్ముట్టిలతో పాటు మరికొంతమంది నటులు కూడా ఈ మధ్య మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితులవుతున్నారు.

బిజు మీనన్ సినిమాలని తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఓ క్రైమ్ ని పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వారికి ఎదురయ్యే సవాళ్ళు , వాటిని డీలింగ్ చేసిన తీరుని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో తీస్తే అది హిట్టే.. అలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమానే ఈ ‘ తలవన్(Talavan). జిస్ జాయ్ ఈ మూవీ దర్శకుడు. ఈ మూవీ మలయాళంలో ‘మే’ నెలలో విడుదలైంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక సోనిలివ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. 

సెప్టెంబరు 12 నుండి తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో ‘తలవన్’  సోనిలివ్ లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. బిజు మీనన్, ఆసిఫ్ అలీ పోలీస్ ఆఫీసర్లుగా చేసిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అక్కడ మంచి హిట్ గా నిలిచింది. ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన కెరీర్ లో ఢిఫరెంట్ కేసులని ఎలా సాల్వ్ చేశారో చెప్తూ సాగే ఈ కథనం అక్కడ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, బిజిఎమ్, ట్విస్ట్ లు ఇలా అన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ మూవీని మీరు మిస్ అవ్వకండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here