Sirnapally waterFalls: ప్రతిసారి వీకెండ్ అంటే రెండు రోజులు మాత్రమే వచ్చేవి, ఈసారి మాత్రం ఆగస్టు 15 గురువారం రావడం, వరలక్ష్మీ వ్రతం శుక్రవారం రావడం, శనివారం, ఆదివారం తర్వాత రక్షాబంధన్ సోమవారం రావడం వల్ల ఐదు రోజులు పాటు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ సమయంలో చాలా తక్కువ ఖర్చులో అందమైన ప్రదేశాలను చూడాలంటే… సిర్నాపల్లి జలపాతాన్ని చూసేందుకు ప్లాన్ చేయండి. దట్టమైన అడవికి దగ్గరలో ఉండే ఈ సిర్నాపల్లి జలపాతం చూసేకొద్దీ మరింత చూడాలనిపించేలా ఉంటుంది. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి నీటిధారలు కిందకి జాలువారుతూ ఉంటాయి. అక్కడి పక్షులు, అందమైన చెట్లు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. సిర్నాపల్లి జలపాతానికి వెళ్లడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. చాలా సింపుల్‌గా దీన్ని చూసి రావచ్చు. అన్నట్టు ఈ జలపాతం ఎక్కడుందో చెప్పలేదు కదూ ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here