అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏ1గా ఉన్న జోగి రాజీవ్‌ను ఇబ్రహీం పట్నంలోని జోగి రమేష్ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఏ2గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేవ్వరరావు ఉన్నారు. సీఐడీ నమోదు చేసిన కేసులోనే ఏసీబీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై 420, 409, 467, 471, 120(బి), 34 ఐపీసీ సెక్షన్లు నమోదు చేశారు. నిందితుల్లో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహన రాందాసు, వెంకటసీతామహాలక్ష్మీ, గ్రామ సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తాసీల్దార్ విజయ్‌కుమార్, విజయవాడ రూరల్ తాసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు ఉన్నారు.
Home Andhra Pradesh అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్ట్-former minister jogi rameshs...