టాలీవుడ్‌లో సంచలన విజయాలు అందుకుంటూ టాప్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్‌ తన సేవా నిరతిని చాటుకున్నారు. దర్శకుల సంఘం సభ్యుల గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు తనవంతు సాయంగా రూ.5లక్షలు విరాళంగా అందించారు. ఈ విషయాన్ని సంఘం అధ్యక్షుడు బి.వీరశంకర్‌, కార్యదర్శి సి.హెచ్‌.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. 

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని చెప్పారన్నారు. అందులో భాగంగానే తాను రూ.5 లక్షలు విరాళంగా అందిస్తున్నానని సుకుమార్‌ చెప్పడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని అధ్యక్ష కార్యదర్శులు ఆ ప్రకటనలో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here