సోషల్ మీడియాలో రూమర్ విహరించని రోజంటూ ఉండదు. కాకపోతే  ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోరు అనుకోండి. కానీ  ఈ సారి మాత్రం ఆ రూమర్ వైపు ఒక లుక్ వెయ్యడమే కాకుండా  ఒక విలువ, హోదా ని కూడా ఇస్తున్నారు. ప్రభాస్(prabhas)ఫ్యాన్స్ అయితే ఆ రూమర్ నిజమవ్వాలని తమ తమ ఇష్ట దైవాలని కూడా  ప్రార్థిస్తున్నారు.ఇంతకీ ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

ప్రభాస్ లేటెస్ట్ హిట్ కల్కి 2898 ఏ డి(kalki 2898 ad)నాగ్ అశ్విన్(nag ashwin)దర్శకత్వంలో  జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదలై ప్రేక్షకులని ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లడమే కాకుండా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  కలెక్షన్ల సునామీని కూడా సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ అతి త్వరలో ఓటిటి లోకి అడుగుపెట్టబోతుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అగస్ట్ 23 నుంచి హిందీ తప్ప మిగతా అన్ని భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. హిందీలో మాత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి.కాకపోతే మేకర్స్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అభిమానులు మాత్రం ఈ  రూమర్ నిజమవ్వాలని కోరుకుంటున్నారు.

కురుక్షేత్రం జరిగిన  ఆరువేల ఏళ్ళ తర్వాత కల్కి కథ మొదలవుతుంది. ఎన్నో వ్యయప్రయాసలకి ఓర్చి కల్కిని తెరకెక్కించడం  జరిగింది. అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతో మూవీస్ సుమారు 600 కోట్ల బడ్జట్ తో నిర్మించగా ఆ ఖర్చు మొత్తం స్క్రీన్ మీద కనపడుతుంది. అదే విధంగా మూవీ చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరు ఒక అద్భుతమైన లోకం లో విహరిస్తున్నటుగా ఉంటుంది. భైరవగా ప్రభాస్, అశ్వథామ గా  అమితాబ్,సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్(kamal haasan)సుమతి గా  దీపికా పదుకునే లు సూపర్ గా  చేసారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here