రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ, తన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడంలోనూ ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల వాయనాడ్ బాధితుల సహాయార్థం రూ.2 కోట్లు విరాళం అందించారు. అలాగే హైదరాబాద్ లో వంద మందికి పైగా విద్యార్థులను చదివిస్తున్నారు. ఇలా ఎందరికో అండగా ఉంటూ తన మంచి మనసుని చాటుకుంటున్న ప్రభాస్, తన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడంలోనే ఎక్కువ ఆనందం పొందుతారు.

ఇటీవల ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD)తో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ‘బాహుబలి-2’ తర్వాత ప్రభాస్ కెరీర్ లో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా నిలిచింది. తనకి ఇంతటి విజయాన్ని అందించిన ‘కల్కి’ టీంకి ప్రభాస్ తాజాగా విలువైన బహుమతులను అందించారట. దాదాపు 300 మందికి ప్రభాస్ గిఫ్ట్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో రూ.2 లక్షల విలువైన వాచ్ లు కూడా ఉన్నాయట. కొందరికి వాచ్ లను గిఫ్ట్ లుగా ఇవ్వగా.. మిగతా వారికి వేరే విలువలైన గిఫ్ట్ లు ఇచ్చినట్లు సమాచారం.

సినిమా హిట్ అయితే డైరెక్టర్ కి హీరో గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలున్నాయి. లేదా మూవీ టీంకి ప్రొడ్యూసర్ గిఫ్ట్ లు ఇచ్చిన సందర్భాలున్నాయి. అయితే ఒక హీరో.. తాను నటించిన సినిమా హిట్ అయిందని, మూవీ టీం అందరికీ గిఫ్ట్ లు ఇవ్వడం చాలా అరుదు. అలాంటి అరుదైన పనే డార్లింగ్ ప్రభాస్ చేశాడు. దీంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here