జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దేవర’ (Devara)పై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగు పెట్టనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్.. అభిమానుల అంచనాలను రెట్టింపు చేశాడు.

దేవర పార్ట్ 1 కోసం తన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ తెలిపాడు. ఇది అద్భుతమైన ప్రయాణమని అన్నాడు. ప్రేమ సముద్రాన్ని, అద్భుతమైన టీంని మిస్ అవుతానని పేర్కొన్నాడు. కొరటాల శివ సృష్టించిన ఈ దేవర ప్రపంచాన్ని సెప్టెంబరు 27న మీ అందరికీ చూపించడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నానని ఎన్టీఆర్ రాసుకొచ్చాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here