కొన్ని ఆహారాలు, పానీయాలు వేడివేడిగా ఆస్వాదించడానికి మనం మళ్లీ మళ్లీ వేడి చేస్తాం. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యకరమే. అయితే ఒకసారి వండాక, చల్లారాక మళ్లీ వేడి చేయడం మాత్రం అనేక నష్టాలను తెస్తుంది. వైరల్ రీల్లో, న్యూట్రిషనిస్ట్ కిరణ్ కుక్రేజా టీ, నూనె, పాలకూర.. ఈ మూడింటిని ఎందుకు తిరిగి వేడి చేయకూడదో వివరించారు. వీటిని మళ్లీ వేడి చేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని ఆమె తెలిపారు. అలా వేడి చేసి తింటే ఏం జరుగుతుందో చూడండి.