సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 778 లో సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమి గత ప్రభుత్వం క్రీడాప్రాంగణం,మెగా ప్రకృతితో వనాలకు కేటాయించి, సుమారు 2000 మొక్కలు నాటినా కొందరు కబ్జా చేసి నాటు వేశారని,తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ మాజీ సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు శనివారం తహశీల్దార్ హిమబిందుకు వినతిపత్రం అందజేశారు.వెంటనే స్పందించిన ఎమ్మార్వో హిమబిందు సంబంధిత అధికారులతో కలిసి సర్వే నెంబర్ 778 వద్దకు క్షేత్ర స్థాయి విచారణకు వెళ్లి, కొంతమేర నాటు వేసినట్లు గుర్తించి, తక్షణమే 6 ఎకరాలకు ఫెన్సింగ్ వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 Former Sarpanch Petition To Tehsildar On Government Land Acquisition, Former Sar-TeluguStop.com

ఈ భూమి ప్రభుత్వ పరిధిలో ఉందని,తక్షణమే వేసిన నారును తీసివేయాలని సంబంధిత రైతులకు సూచించారు.

ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఈ క్రీడా ప్రాంగణం,మెగా ప్రకృతి వనం వల్ల పక్కన పట్టా భూముల రైతులు కొంతమంది భూమిని కోల్పోతున్నామని గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని,ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సర్వే చేయించి పట్టాదారుల భూమి పోవడం లేదని తేల్చి చెప్పిందన్నారు.అయినప్పటికీ అప్పటి గ్రామ పెద్దలు తప్పనిసరిగా కొంత భూమిని వేరేచోట ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.

ఆ హామీ ప్రకారం ప్రస్తుత ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here