సినిమా రంగంలో ఎప్పుడు ఏ మ్యాజిక్‌ జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. కొన్ని వందల సినిమాలు నిర్మించిన నిర్మాతకైనా, నటించిన హీరోకైనా, డైరెక్టర్‌కైనా ప్రతి సినిమా కొత్త అనుభవాన్నే ఇస్తుంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేసే మ్యాజిక్‌ వల్ల ఊహించని ఘనవిజయాలు నమోదు అవుతాయి. అలా ఈమధ్యకాలంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ హిందీ సినిమా ‘స్త్రీ2’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే రూ.50 కోట్లు కలెక్ట్‌ చేసి ఏ సినిమా సాధించని రికార్డును సొంతం చేసుకుంది. ఆగస్ట్‌ 15న విడుదలైన ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో రూ.200 కోట్లు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. 

గతంలో హారర్‌ బేస్డ్‌ మూవీస్‌ చాలా వచ్చాయి. అయితే ‘స్త్రీ2’లో ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఎందుకంత భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి అని ట్రేడ్‌వర్గాలు ఆరా తీయడం మొదలుపెట్టాయి. సినిమాలోని కంటెంట్‌ పాతదే అయినా దాన్ని డీల్‌ చేసిన విధానం వల్ల ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని కలిగింది. అలాగే సినిమా రిలీజ్‌కి ముందు విడుదల చేసిన ట్రైలర్‌ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఈ ట్రైలర్‌కి 43 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయంటే అది ఎంతగా ఆడియన్స్‌లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా మొదటి భాగం ‘స్త్రీ’ ట్రైలర్‌కి 56 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. కానీ, ఈ ట్రైలర్‌ రిలీజ్‌ అయి 6 సంవత్సరాలవుతోంది. కానీ, ‘స్త్రీ2’ ట్రైలర్‌ రిలీజ్‌ అయి ఒక నెల మాత్రమే అవుతోంది. 

ఇదంతా ఒక ఎత్తయితే.. ‘ఆజ్‌ కి రాత్‌’ అనే ఐటమ్‌ సాంగ్‌ సినిమా విజయంలో మరో కీలక పాత్ర పోషించింది. ఈ పాటలో తమన్నా చేసిన మూమెంట్స్‌కి ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. మొదటి భాగంలోని ఐటమ్‌ సాంగ్‌ను నోరా ఫతేహి చేసింది. సీక్వెల్‌లోనూ ఆమెతోనే ఐటమ్‌ సాంగ్‌ చేయించాలని మొదట భావించారు. కానీ, చివరి క్షణంలో అభిప్రాయం మార్చుకున్న దర్శకనిర్మాతలు తమన్నాకు ఓటేశారు. అది సినిమాకి బాగా ప్లస్‌ అయింది. ‘ఆజ్‌ కి రాత్‌’ పాటకు సినిమా రిలీజ్‌కి ముందే యూట్యూబ్‌లో 110 మిలియన్‌ వ్యూస్‌ రావడం ఒక రికార్డుగా చెప్పొచ్చు. 

నోరా ఫతేహి బదులుగా తమన్నాను తీసుకోవాలన్న నిర్ణయం వల్ల సినిమాకి బాగా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ ఐటమ్‌ సాంగ్‌ నిడివి మూడు నిమిషాలతోపాటు మరో రెండు నిమిషాలు మాత్రమే తమన్నా సినిమాలో కనిపిస్తుంది. టోటల్‌గా ఈ ఐదు నిమిషాలకు కోటి రూపాయలు రెమ్యునరేషన్‌ తీసుకుంది తమన్నా. ‘స్త్రీ’లోని ఐటమ్‌ సాంగ్‌కి నోరా ఫతేహికి 25 లక్షలు చెల్లించారు. అయితే తమన్నా తీసుకున్న కోటి రూపాయలకు పూర్తి న్యాయం చెయ్యడమే కాకుండా ‘స్త్రీ2’ ఘనవిజయంలో కీలక పాత్ర పోషించడం విశేషంగా చెప్పుకోవచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here