అవును.. మలయాళ సినీ  పరిశ్రమలో  మహిళా ఆర్టిస్టుల పై లైంగిక  వేధింపులు, దోపిడీ, అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి జరుగుతున్నాయి. కొంత మంది నిర్మాతలు, దర్శకులు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్ ల ఆధ్వర్యంలోనే అదంతా జరుగుతుంది. మహిళా నటీమణులు ఉన్న గది తలుపులని కూడా బద్దలు కొడుతున్నారు. అసలు విషయం ఏంటో పూర్తిగా చూద్దాం.

2017 లో కేరళలో  ప్రముఖ హీరోయిన్ భావన(bavana)ని కొంత మంది దుండగలు  కారులో తిప్పుతూ లైంగిక దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిగా స్టార్ హీరో దిలీప్  ఉన్నాడు. ఇక ఈ  సంఘటన తో అప్రమత్తమైన అప్పటి కేరళ ప్రభుత్వం మలయాళ సినీ పరిశ్రమలో నటీమణులు ఎదుర్కుంటున్న వేధింపుల గురించి రిపోర్ట్ ఇవ్వాలని జస్టిస్ హేమ(hema committee)కమిటి ని ఏర్పాటు చేసింది. దాంతో ఎంక్వయిరీ చేసిన కమిటీ తుది నివేదికను ప్రస్తుత ముఖ్యమంత్రి  పినరయి విజయన్(pinarayi vijayan)కి అందించింది. అందులో చాలా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలయాళ సినీ పరిశ్రమని క్రిమినల్ గ్యాంగ్స్ నియంత్రిస్తున్నాయి. తమకి లొంగని వాళ్ళని వేధిస్తున్నారు. ఇందులో కొంత మంది హీరో,నిర్మాత, దర్శకులతో పాటు మెయిన్ టెక్నీషియన్స్  ఉన్నారని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

ఆలాగే అవకాశాల కోసం రాజీపడుతున్న మహిళలకి కోడ్ నేమ్స్ ఫిక్స్ చేస్తున్నారు.లొంగని వారిని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు. షూటింగ్ సమయంలో రాత్రి పుట తలుపు కొట్టడం కూడా  సర్వ సాధారణమయ్యింది.కొన్ని సార్లు మద్యం మత్తులో తలుపుని బద్దలు కూడా కొట్టిన సందర్భాలు కూడా  ఉన్నాయి. ప్రాణ భయంతో వాటి గురించి  పోలీసులకి, కోర్టు లకి  ఫిర్యాదు చేయలేకపోతున్నారని కూడా  తెలిపింది. మలయాళ చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న చాలా మంది నటీమణుల నుంచి హేమ కమిటీ  ఈ విషయాలన్నింటిని సేకరించింది. తెలుగులో ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గాను క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను రాణించి మెప్పించిన  సీనియర్ నటీమణి శారద(sarada)మరియు జస్టిస్ హేమ, మాజీ ఐఏఎస్ అధికారిణి కే బి వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కేరళలోని వాయినాడ్ లో కొండ చరియలు విరిగిపడి వందలాది మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆ బాధలో ఉన్న కేరళ ప్రజానీకానికి మహిళా నటీమణులపై  లైంగిక వేధింపుల రిపోర్ట్ దిగ్బ్రాంతి కలిగించే అంశమే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here