తరగతి గదుల్లో నిత్యం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని పాఠ్యాంశాలు చదివించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Sandeep Kumar Jha ) సూచించారు.కోనరావుపేట మండలం( Konaraopet ) మర్తనపేట ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Special Attention Should Be Given To The Students, Said Collector Sandeep Kumar-TeluguStop.com

నేరుగా తరగతి గదిలోకి వెళ్లి పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు.

అనంతరం ఆఫీస్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసి, ఎందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.

ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారని, 25 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఈ రోజు హెచ్ఎం సెలవులో ఉన్నారని, 13 మంది విద్యార్థులు స్కూల్ కు వచ్చారని కలెక్టర్ దృష్టికి ఉపాధ్యాయుడు తీసుకెళ్లారు.అనంతరం మధ్యాహ్నం భోజనం తయారు చేసే గదిని పరిశీలించి, నిర్వాహకురాలితో మాట్లాడారు.

మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.గదిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు ప్రతి సబ్జెక్టు పై అవగాహన వచ్చేలా బోధించాలని, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, చదవడం, రాయడం, మ్యాథ్స్, ఇంగ్లీష్ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయుడు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here