పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)కి తన అన్నయ్య  చిరంజీవి (chiranjeevi)అంటే ఎంత అభిమానమో, చిరంజీవి కి పవన్ అంటే ఎంత అభిమానమో ఇప్పుడు  కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరు కి సినీ ,వ్యాపార, రాజకీయాలకి చెందిన పలువురు ప్రముఖులు  తమ అభినందలని తెలియచేస్తున్నారు. ఈ  వరుసలోనే  పవర్ స్టార్ కూడా తన అభినందనలు తెలియచేసాడు. పైగా పవన్ ఇప్పుడు డిప్యూటీ సిఎం తో పాటు మంత్రి కూడా. ఈ  హోదాలోనే బహిరంగంగా ఒక లెటర్ కూడా  విడుదల చేసాడు. అందులో ఏముందో చూద్దాం.

 నా దృష్టిలో అన్నయ్య ఆపద్భాంధవుడు .ఆపదలో ఉన్న ఎందరికో సాయం చేసాడు.అనారోగ్యం బారిన పడిన వాళ్ళకి ప్రాణదానం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.కొన్ని సార్లు చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావాల్సిన వారి కోసం ఎంత వరకైనా తగ్గుతారు, కుదరకపోతే  అభ్యర్థిస్తారు. ఆ గుణమే అన్నయ్య ని సుగుణ సంపన్నుడిగా చేసిందని చెప్పాడు.

 

అలాగే గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో ఐదు కోట్ల విరాళాన్ని జనసేన కి అందచెయ్యడమే కాకుండా  విజయాన్ని అందుకోవాలని మా ఇంటి ఇలవేల్పు ఆంజనేయస్వామి సాక్షిగా నన్ను ఆశీర్వదించారు. ఆ రోజు అన్నయ్య ఇచ్చిన నైతిక బలం మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాత ని అన్నగా ఇచ్చినందుకు ఆ దేవుడి కి సదా కృతజ్ఞుడుగా ఉంటాను .అలాగే తల్లి లాంటి  వదినమ్మతో కలిసి చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవ దేవుడ్ని మనసారా కోరుకుంటున్నానని కూడా తెలిపాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here