శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)మరికొన్ని రోజుల్లో మిసెస్ ఆఫ్ నాగ చైతన్య(naga chaitanya)గా మారబోతుంది. దీంతో ఓవర్ నైట్ లెజండరీ గా మారిపోయింది. అక్కినేని వారి కోడలంటే అట్లాగే ఉంటుంది మరి. అసలు అక్కినేని నాగేశ్వరరావు మనవరాలుగా, నాగార్జున కోడలిగా ఉండాలంటే పెట్టి పుట్టాలి కూడా. ఇక ఆ అదృష్టాన్ని శోభిత దక్కించుకోవడంతో నిత్యం ఆమె గురించి సోషల్ మీడియాలో వెతుకులాట జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒక వార్త టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
డాన్ మూవీకి సీక్వెల్ గా డాన్ 3(don 3)తెరకెక్కనుంది. మొదటి రెండు భాగాల్లో షారుక్ ఖాన్ చెయ్యగా ఇప్పుడు మూడవ భాగంలో రణవీర్ సింగ్(ranveer singh)చేస్తున్నాడు.త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో శోభిత ఫిక్స్ అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాకపోతే సినిమా మొత్తం కాదని ఒక స్పెషల్ సాంగ్ లో చెయ్యబోతుందని అంటున్నారు . . ఈ మేరకు శోభిత తో దర్శకుడు ఫరాన్ అక్తర్ చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇది నిజామా కాదా అనే అంశంపై శోభిత టీం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఈ న్యూస్ అయితే ఒక రేంజ్ లోనే హల్ చల్ చేస్తుంది. ఇక అక్కినేని ఫ్యాన్స్ ఐతే స్పెషల్ సాంగ్ కి శోభిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా అది ఐటెం సాంగ్ మాత్రం కాకూడదని కామెంట్స్ చేస్తున్నారు
2013 లో ఫెమినా మిస్ ఇండియా రన్నర్ గా నిలిచిన శోభిత ఇప్పటి వరకు సుమారు పది సినిమాల దాకా చేసింది .ఆ లిస్ట్ లో తెలుగు తో పాటు ఇతర బాషా సినిమాలు ఉన్నాయి. అడవి శేషు గూఢచారి ఆమెకి మంచి గుర్తింపుని ఇచ్చింది.రీసెంట్ గా మంకీ మాన్ అనే అమెరికన్ సినిమా కూడా చెయ్యగా ఏప్రిల్ లో ఆ మూవీ విడుదల అయ్యింది. ఇటీవలే సితార అనే హిందీ మూవీని కంప్లీట్ చేసింది.