‘ఈశ్వర్’ నుంచి ప్రభాస్ కెరీర్‌ని పరిశీలిస్తే ఇప్పటివరకు అతను చేసిన సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన వారంతా హీరోయిన్లుగా ఎస్టాబ్లిష్ అయినవారే. ఒక్క సినిమాలో కూడా ప్రభాస్ కొత్త హీరోయిన్‌తో నటించలేదు. మొదటిసారి ఆ అవకాశం ఇమాన్వికి దక్కింది. యూ ట్యూబ్‌లో తన వీడియోల ద్వారా పాపులర్ అయిన ఇమాన్వి అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్.. ప్రభాస్ కొత్త సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ భామ గురించే చర్చ నడుస్తోంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికైన ఇమాన్వి ఎవరో తెలియనివారు ఆమె గురించి తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పటికే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఆమె చేసే డాన్స్ వీడియోలకు హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది. ప్రభాస్ సినిమాకి సెలెక్ట్ అయ్యే సమయానికే యూట్యూబ్‌లో ఆమె ఆదాయం లక్షల్లో ఉందంటే నమ్ముతారా. ఈ సినిమా ఓపెనింగ్ అయిన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఇమాన్వికి సంబంధించిన మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా ఆమెకు కోటి రూపాయల పారితోషికం లభిస్తోందనేది ఆ వార్త. ఏ హీరోయిన్‌కైనా మొదటి సినిమాకే ఇంత భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం అరుదనే చెప్పాలి. మొదటి సినిమాకే కోటి తీసుకుంటే ఆ తర్వాత చేసే సినిమాలకు ఆమె రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఉంటుందో మరి.