అల్లు అర్జున్‌ గడ్డం తీసేశాడు. దాంతో పుష్ప లుక్‌ మారిపోయింది. ఆమధ్య ఇది చాలా పెద్ద హాట్‌ టాపిక్‌ అయిపోయింది. రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ‘పుష్ప2’ షూటింగ్‌ ఆగిపోయిందని, అందుకే బన్నీ గడ్డం తీసేశాడని అంతా అనుకున్నారు. అయితే దానికి క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్‌. షూటింగ్‌ మొదలైన తర్వాత మళ్ళీ గడ్డం పెంచుతాడని చెప్పుకున్నారు. ఇప్పుడు అనుకున్న షెడ్యూల్‌ కంటే ముందే షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వడంతో కంటిన్యుటీ సమస్య వచ్చింది. పూర్తిస్థాయిలో గడ్డం లేకపోవడం వల్ల క్లైమాక్స్‌ సీన్స్‌ దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి సమస్య వచ్చినపుడు ఆర్టిఫిషియల్‌గా గడ్డాలు, మీసాలు వంటివి ఎరేంజ్‌ చేస్తూ ఉంటారు. కానీ, అవి అంత నేచురల్‌గా ఉండవు అనేది అందరికీ తెలిసిన విషయమే. 

ఈరోజుల్లో అలాంటి ప్రయోగాలు చెయ్యడం లేదు. ఇప్పుడు బన్నీ వల్ల వచ్చిన సమస్యను ఏవిధంగా పరిష్కరించాలి అని ఆలోచించిన చిత్ర యూనిట్‌ ముంబాయి నుంచి ఒక ఎక్స్‌పర్ట్‌ని పిలిపించారట. సినిమాలో బన్ని గెటప్‌కి తగ్గట్టుగా కృతిమ గడ్డాని తయారు చేశాడని తెలుస్తోంది. దీనికి ఖర్చు కూడా భారీగానే అయిందని సమాచారం. షూటింగ్‌ ఉన్నప్పుడే దీన్ని ఉపయోగించేలా తయారు చేయించారట. ఇటీవల ‘మారుతి నగర్‌ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు బన్నీ హాజరయ్యాడు. అయితే పుష్ప గెటప్‌ కనిపించలేదు. కథలో భాగంగా పుష్ప కొత్తలుక్‌తో కనిపిస్తాడేమో అని అనుకుంటున్నారు అభిమానులు. ‘పుష్ప2’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. మొదట ఆగస్ట్‌ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల డిసెంబర్‌ 6కి పోస్ట్‌పోన్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ డేట్‌కైనా సినిమా రిలీజ్‌ అవుతుందా అనే డౌట్‌ అందరికీ వచ్చింది. ‘మారుతి నగర్‌ సుబ్రహ్మణ్యం’ ఫంక్షన్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు బన్నీ. డిసెంబర్‌ 6న సినిమా రిలీజ్‌ అవుతుందని కన్‌ఫర్మ్‌ చేశాడు. రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ అయినా సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏమాత్రం తగ్గలేదన్నది నిజం. దానికి తగ్గట్టుగానే డెఫినెట్‌ హిట్‌ అనే కాన్ఫిడెన్స్‌తో సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు సుకుమార్‌. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here