మెగాస్టార్ చిరంజీవి అంటే ఆ జనరేషన్ వాళ్ళకైనా ఈ జనరేషన్ వాళ్ళకైనా ఒక ఎనర్జీ. ఇలాంటి టైములో కమిటీ కుర్రోళ్లు మూవీ టీంను చిరంజీవి అభినందించి వాళ్లకు ఆయన బ్లేసింగ్స్ ఇచ్చారు . నిహారిక నిర్మించిన ఈ మూవీకి  ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్‌గా కమిటీ కుర్రోళ్లు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో నిహారిక మొదటి సారిగా నిర్మాత హోదాలో బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ నే అందుకుంది.  ఇక ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా  నిన్న మధ్యాహ్నం 12 గంటల రాత్రి 12 గంటల వరకు 12 గంటల పాటు ఈ లైవ్ మారథాన్ జరిగింది.

ఇందులో ఎంతో మంది పాల్గొని చిరుకి బర్త్ డే విషెస్ చెప్పారు.  ఇక చిరంజీవి గురించి ఆది చాల విషయాలు చెప్పుకొచ్చాడు.  “రాబోయే కొత్త నటీనటులకు  చిరంజీవి జీవితం ఒక లైబ్రరీ లాంటిది. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కి ఎంతోమంది  మొగుళ్ళు ఉన్నారు  కానీ 90 స్ లో బాక్స్ ఆఫీస్ కి ఉన్న ఒకే ఒక్క మొగుడు ఘరానా మొగుడు. ఎన్నో దేశాల్లో చిరు ఫాన్స్ ఉన్నారు. వాళ్ళ దేశాలు, పద్ధతులు, అలవాట్లు మారుంటాయి కానీ చిరంజీవి మీద అభిమానం మాత్రం మారలేదు. విజేత, ఛాలెంజ్ సినిమాలు నాకు చాలా ఇష్టం. నట విశ్వరూపం అంటే కమల్ హాసన్ అని, స్టైల్ అంటే రజనీకాంత్ అని మాట్లాడుకుంటాం.. వాళ్లిద్దరూ కలిపితేనే చిరంజీవి గారు అని సాక్షాత్తు కే.బాలచందర్ గారే చెప్పారు. ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక మూల చిరు మూవీస్ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అప్పట్లో ఎంతో పెద్ద తుఫాను టైములో రిలీజయిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని ఆడియన్స్ చూసి బంపర్ హిట్ చేసారంటే చిరు మీద ఎంత అభిమానమో ఊహించుకోవచ్చు” అని చెప్పాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here