విక్రమ్(virkam)తో  కమల్ హాసన్(kamal haasan) ఎలాంటి  హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడో అందరకి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రికార్డు కలెక్షన్స్ ని సృష్టించడమే కాకుండా కమల్ ప్లాపుల పరంపరకి కూడా విక్రమ్ ముగింపు పలికింది. మరి ఈ మూవీకి, నితిన్(Nithiin)కి ఒక సంబంధం ఉంది. అలాగే ప్రెజంట్ బహుభాషా హీరో  శివ కార్తికేయన్(sivakarthikeyan)అమరన్(amaran)చేస్తున్నాడు. దివాళి కానుకగా  అక్టోబర్ 31 న విడుదల అవ్వబోతున్న ఈ మూవీతో కూడా నితిన్ కి రిలేషన్ ఉంది.అదేంటో చూద్దాం.

 నితిన్ ఓన్ బ్యానర్  శ్రేష్ట్ మూవీస్ పై. హీరోగా ఆ బ్యానర్ పై చాలా సినిమాలు చేసాడు. అదే టైం లో అదర్ మూవీస్ హక్కులని కూడా పొంది సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కూడా  చేస్తుంటాడు. ఇక తమిళ సినిమాలు అయితే ఏకంగా శ్రేష్ట్  బ్యానర్ పైనే రిలీజ్ అవుతాయి.ఈ కోవలోనే శ్రేష్ట్ మూవీస్ పై  విక్రమ్ ని  తెలుగు నాట  రిలీజ్ చేసాడు. అంతే కాదు భారీ లాభాలని కూడా పొందాడు. ఇప్పుడు అమరన్ ని కూడా  తెలుగు నాట రిలీజ్ చేస్తున్నాడు. ఈ విషయాన్నీ శ్రేష్ట్ మూవీస్ అధికారకంగా  ప్రకటించింది. దీంతో నితిన్ కొన్నాడు కాబట్టి విక్రమ్ లాగా అమరన్ కూడా హిట్ అనే అభిప్రాయం  సినీ సర్కిల్స్ లో జోరుగానే జరుగుతుంది.ప్రచార చిత్రాలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి.

 

ఇక నితిన్ సినిమాల  విషయానికి వస్తే ప్రెజంట్ రాబిన్ హుడ్, తమ్ముడు  చేస్తున్నాడు. రాబిన్ హుడ్ కి వెంకీ కుడుముల దర్శకుడు. ఆ ఇద్దరి కాంబోలో గతంలో వచ్చిన  భీష్మ  మంచి విజయాన్ని అందుకుంది.  ఇక తమ్ముడు కి పవన్  వకీల్ సాబ్ ఫేమ్  వేణు శ్రీరామ్ దర్శకుడు.నితిన్ గత చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్  పరాజయం పాలవ్వడంతో ఈ  రెండిటి మీద  నితిన్ తో పాటు అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here