బహుశా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)కెరీర్ లో ఎక్కువ రోజులు సెట్స్ మీద ఉన్న మూవీ గేమ్ చేంజర్ నే కావచ్చు. ఆర్ఆర్ఆర్ ఉన్నా కూడా అది ఎన్టీఆర్, చరణ్ కాంబో కిందకి రావడంతో పాటుగా కోవిడ్ అనేది అడ్డుగా వచ్చింది. కానీ గేమ్ చేంజర్(game changer)కి మాత్రం ఎలాంటి అడ్డు లేకపోయినా లేటు అవుతునే వస్తుంది. అభిమానులైతే గేమ్ చేంజర్ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తు మూవీ అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో తిష్ట వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక న్యూస్ వాళ్ళని షాక్ కి గురి చేస్తుంది. ఇప్పుడు ఆ న్యూస్ ఒట్టి రూమర్ అని తేలిపోయింది.
గత కొన్ని రోజులుగా గేమ్ చేంజర్ కి సంబంధించి చరణ్ తో కొన్ని సీన్స్ రీ షూట్ చేయాల్సి ఉందని, మరో వారం రోజులు పాటు చరణ్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ లో నిరుత్సాహం ఏర్పడింది. ఎందుకంటే చరణ్ పోర్షన్ మొత్తం కంప్లీట్ అయ్యింది. అధర్ ఆర్టిస్టులతో కొన్ని రోజులు షూట్ చేస్తే గుమ్మడికాయ కొట్టినట్టే అని దర్శకుడు శంకర్(shankar) అధికారకంగా కన్ఫార్మ్ కూడా చేసాడు. అలాంటిది మళ్ళీ చరణ్ తో షూటింగ్ అంటున్నారేంటని ఫ్యాన్స్ కంగారులో పడ్డారు. గేమ్ చేంజర్ ట్రాక్ రికార్డు అలాంటిది మరి. కానీ అభిమానులు కంగారు పడాల్సిన పని లేదు. చరణ్ పై చేయాల్సిన సీన్స్ అన్నీ హండ్రెడ్ పర్శంట్ అయిపోయాయి. చరణ్ షూట్ లో పాల్గొనాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎలాంటి రూమర్స్ ని నమ్మవద్దని మెగా సినీ కాంపౌండ్ కి చెందిన కొంత మంది సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు.
దిల్ రాజు తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో గేమ్ చేంజర్ ని అత్యంత భారీ బడ్జట్ తో నిర్మిస్తున్నాడు. క్రిస్మస్ కి రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రిలీజ్ డేట్ మీద త్వరలోనే అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. కియారా అద్వానీ హీరోయిన్ కాగా అంజలికూడా హీరోయిన్ కేటగిరి కే వస్తుంది. ఈ విషయాన్ని తనే వెల్లడి చేసింది. చరణ్ డ్యూయల్ రోల్ అనే టాక్ అయితే చాలా బలంగానే ఉంది.