మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా నటీమణులపై  లైంగిక వేధింపులు జరుగుతున్నాయని జస్టిస్ హేమ కమిటీ తేల్చి చెప్పిన విషయం అందరకి తెలిసిందే. ఈ మేరకు నివేదిక మొత్తాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కి కూడా  అందించారు. ఇప్పుడు మా చిత్ర పరిశమ్రలోను  లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, దర్యాప్తు చేసే అన్ని విషయాలు బయటకి వస్తాయని  ప్రముఖ హీరోయిన్  అంటుంది.

రితా భరి చక్రవర్తి(Ritabhari chakraborty)బెంగాలీ సినీ పరిశ్రమలో మంచి పేరెన్నిక గన్న నటి. ఎన్నో మంచి చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా  ఒక పోస్ట్ చేసింది.బెంగాలీ చిత్ర పరిశ్రమలో నాతో పాటు చాలా మంది నటీమణులు  కొంత మంది నటులు, దర్శక, నిర్మాతల చేతిలో లైంగిక వేధింపులకి గురవుతున్నారు. మలయాళ గవర్నమెంట్ లాగానే మమతా బెనర్జీ(mamata banerjee)కూడా ఒక కమిషన్ ని ఏర్పాటు చెయ్యాలని కోరింది. అయితే ఆమె ఎవరి పేర్లని ప్రస్తావించలేదు.

అలాగే ఇంకొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది.మహిళా నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వాళ్లంతా  ఇప్పుడు బెంగాల్ లో డాక్టర్ మీద జరిగిన అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలలో ఎలాంటి సిగ్గు లేకుండా పాల్గొంటున్నారని  చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో బెంగాల్ చిత్ర పరిశ్రమే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. మున్ముందు మరింత మంది బెంగాలీ  నటీమణులు ముందు కొచ్చి లైంగిక వేధింపుల పై మాట్లాడే  అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అలాగే మమతా బెనర్జీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here