ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్పై విడుదలైన BRS ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్కు బయల్దేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. కాగా.. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఎయిర్పోర్టుకు బయల్దేరే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. న్యాయం గెలిచిందని అని అన్నారు. తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యలు చేశారు.